కారు రెంటల్ యాప్ దుర్వినియోగం: కార్మికుల అరెస్టు
- February 04, 2021
సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, పలువురు విదేశీ కార్మికుల్ని రియాద్‌లో అరెస్టు చేయడం జరిగింది. ప్రముఖ కారు రెంటల్ అప్లికేషన్లకు సంబంధించిన సౌదీ వినియోగదారుల ఐడీలను నిందితులు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించామని సంబంధిత విచారణ బృందాలు వెల్లడించాయి. ఆయా సౌదీ వినియోగదారుల అకౌంట్లను డీ-యాక్టివేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఓ ఫ్యాక్టరీలో నిందితులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. తమ స్పాన్సర్లకు కాకుండా వేరే వ్యక్తుల కోసం వారు పనిచేస్తున్నారు. రియాద్ రీజియన్‌లో 1,400కి పైగా తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా 125 వ్యాపారాలను బుక్ చేశారు. కొన్నింటికి హెచ్చరికలు జారీ చేశారు. కారు రెంటల్, ట్రాన్స్‌పోర్ట్, ట్రేడింగ్ సంస్థలు వీటిల్లో వున్నాయి. 19911 నెంబర్ ద్వారా లేదా సంబంధిత అప్లికేషన్ ద్వారా ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







