మస్కట్:ఇకపై 65 ఏళ్లు దాటిన వృద్ధులకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్
- February 04, 2021
మస్కట్:కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులకు కూడా వ్యాక్సిన్ అందించనుంది ఒమన్ ప్రభుత్వం. ప్రధాన్య క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ విడతల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక రోగుల, 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు లక్ష్యంగా వ్యాక్సిన్ అందించారు. ఇక ఇప్పుడు 65 ఏళ్లు అంతకుమించి వయసు పైబడిన వారిని లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే..తొలి విడతలో లబ్ధిదారుల మెడికల్ కండీషన్ ను పరిగణలోకి తీసుకోగా..ప్రస్తుత దశలో మాత్రం మెడికల్ కండీషన్ తో సంబంధం లేకుండా 65 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందించనున్నారు. ఇదిలాఉంటే..ఇన్నాళ్లుగా తొలి విడతలో ఫైజర్ బయోన్టెక్ టీకా తీసుకున్న వారికి ప్రస్తుత దశలో వ్యాక్సిన్ ఇవ్వబోవటం లేదని స్పష్టం చేసింది. తొలి డోసు తీసుకున్న వారికి రెండో డోసు ఎప్పుడు ఇస్తారనేది ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తారని కూడా వెల్లడించింది. అయితే..చిన్నారులకు వేసే టీకాలు మినహా ఇతర వ్యాక్సిన్లను బలవంతంగా ఇచ్చే ఉద్దేశం తమకు లేదని..అది చట్టపరంగా కూడా విరుద్ధమని వెల్లడించింది. మరోవైపు ఒమన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు. మస్కట్ గవర్నరేట్‌లోని ప్రజల కోసం అల్ సీబ్ స్పెషలిస్ట్ పాలిక్లినిక్, బౌషర్ స్పెషలిస్ట్ పాలిక్లినిక్, కురియాత్ పాలిక్లినిక్ లలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







