ఒమన్:ఇక NOC లేకుండానే ఉద్యోగం మారొచ్చు..
- February 05, 2021
మస్కట్:ఉద్యోగం మారాలనుకునే వలస కార్మికులకు ఒమన్ ప్రభుత్వం ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఇక నుంచి తాము పని చేసే యాజమానులు, సంస్థ యాజమాన్యాల అనుమతి లేకుండా, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేకుండానే వేరే ఉద్యోగాలలో జాయిన్ అవ్వొచ్చు. అయితే..యాజమాని, సంస్థ యాజమాన్యంతో వలస కార్మికులు కుదర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందం ముగిసిన తర్వాత కొత్త ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు విదేశీయుల రెసిడెన్సీ చట్టంలో కీలక సవరణలు చేసింది. NOC నిబంధనతో ప్రస్తుతం పని చేస్తున్న చోటు నుంచి కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశాలు లేక...పాత యజమాని దగ్గర ఉద్యోగంలో కొనసాగలేక వలస కార్మికులు దేశం విడిచి వెళ్తుండటంపై ఒమన్ దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రభుత్వం చేసిన చట్ట సమవరణతో ఇక నుంచి దేశం విడిచి వెళ్లే వలస కార్మికుల సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తోంది. అలాగే స్థానికులు, వలస కార్మికులకు మధ్య వేతనాల్లో అంతరం కూడా కొద్దిమేర తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







