బహ్రెయిన్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 80 మందికి జైలు శిక్ష
- February 05, 2021
మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 80 మందికి జైలు శిక్ష విధించింది బహ్రెయిన్ మైనర్ క్రిమినల్ కోర్టు. 80 మందిలో ఉల్లంఘన తీవ్రతను బట్టి 3 నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే 1000 దినార్ల నుంచి 2000 దినార్ల వరకు జరిమానా కూడా విధించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని..ఐదుగురికి మించి ఎక్కువమంది ఒకే చోట గుమికూడొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే..నిబంధనలు పాటించటంలో విఫలమైన వారిపై సంబంధిత అధికారులు కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషులకు శిక్షలు ఖరారు చేసింది. ఫేస్ మాస్కులు, భౌతిక దూరం నిబంధన ఉల్లంఘనతో పాటు..బ్యూటీ సెలూన్లు, హెయిర్ డ్రెస్సింగ్, రెస్టారెంట్లు, కేఫ్ లు, స్విమ్మింగ్ ఫూల్ కలిగిన రెస్టారెంట్లలోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష