తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 06, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,431కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,608కి చేరింది. కరోనా నుంచి నిన్న 147 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2.91లక్షలకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,977 యాక్టివ్ కేసులుండగా, వారిలో 845 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







