సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన..
- February 07, 2021
హైదరాబాద్:తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌లో 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఏ జిల్లా వాళ్ళు ముందుకు వస్తే అక్కడే సభ నిర్వహిద్దామని సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఎమ్మెల్యే 50 వేలమందితో సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు. ఈ నెల 12 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో కేటీఆర్ సీఎం అవుతారన్న ఊహాగానాలకు కూడా కేసీఆర్ తెరదించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. 10 ఏళ్ల సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. కేటీఆర్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని.. గీత దాటి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని నాయకులను హెచ్చరించారు. మరోవైపు ఖమ్మం,వరంగల్, నల్గొండ గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని కన్ఫామ్ చేశారు ముఖ్యమంత్రి.
ఇక మార్చి 1వ తేదీ నుంచి పార్టీ కమిటీల నియామకం ఉంటుందని చెప్పారు. ఈ నెల 11న మేయర్ ఎన్నికలకు ఎక్స్‌అఫీషియో సభ్యులు కార్పోరేటర్లతో కలిసి జీహెచ్‌ఎంసీ వెళ్లాలని సూచించారు. సీల్డ్ కవర్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు ఉంటాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో సీల్ కవర్ ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు రెండు నెలలపాటు ప్రతి జిల్లాలో తిరుగుతానని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









