సూర్య కి కరోనా..త్వరగా కోలుకోవాలని అభిమానులు మరియు తారల ట్వీట్లు

- February 08, 2021 , by Maagulf
సూర్య కి కరోనా..త్వరగా కోలుకోవాలని అభిమానులు మరియు తారల ట్వీట్లు

హీరో సూర్య‌కి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. త‌న‌కు త్వ‌ర‌గానే న‌యం అవుతుంద‌ని తెలియ‌జేసిన ఆయ‌న‌, వైద్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా సూచ‌న చేశారు. గ‌త ఏడాది సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొంది ఓటీటీలో విడుద‌లైన ఆకాశం నీ హ‌ద్దురా(శూర‌రై పోట్రు) సినిమాతో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు హీరో సూర్య‌.

త‌మిళంతో పాటు తెలుగులో ప్రేక్ష‌కుల‌కు హీరో సూర్య సుప‌రిచితుడే. తెలుగులోనూ సూర్య సినిమాల‌కు మంచి మార్కెట్ ఉంది. అందుక‌నే సూర్య సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల‌వుతుంటాయి. ఇప్పుడు త‌న 40వ సినిమాను ద‌ర్శ‌కుడు పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. రీసెంట్‌గానే సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది కూడా. ఈ సినిమా షూటింగ్స్‌, చ‌ర్చ‌లు ఇత‌ర‌త్ర విష‌యాల‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో సూర్య క‌రోనా సోకి ఉంటుంద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు భావిస్తున్నాయి. పాండిరాజ్ సినిమా త‌ర్వాత వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వాడివాస‌ల్ అనే సినిమాలో న‌టించ‌నున్నారు హీరో సూర్య‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com