కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హైదరాబాద్ కమీషనర్
- February 08, 2021
హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో విడత కొనసాగుతుంది. ఇందులో భాగంగా పాతబస్తీలోని పేట్లబర్జులో ఉన్న నగర పోలీసు శిక్షణా కేంద్రంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా టీకా సురక్షితమని సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఇటీవలే రాష్ర్ట డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో పాటు పలువురు కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో రెండో దశ కరోనా టీకా పంపిణి ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యింది. ఇందులో ఫ్రంట్‌లైన్ వర్కర్లు అయిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు.కరోనా టీకా కోసం సుమారు 2 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







