కొత్త దేశీ యాప్ ఎంట్రీ కి సిద్ధం !
- February 08, 2021
న్యూ ఢిల్లీ:సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంతమైన ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ కు భారీ. తాజా నివేదికల ప్రకారం ప్రభుత్వం వాట్సాప్ ను పోలిన ఫీచర్లతో దేశీయంగా ఒక యాప్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతుంది. సందేశ్ పేరుతో ఆవిష్కరించ నున్న ఈ యాప్ టెస్టింగ్ ప్రక్రియిను ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ యాప్ ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరీక్షకు అందుబాటులో ఉంచింది.
వాట్సాప్ లాంటి యాప్‌ను ఆవిష్కరించే ప్రణాళికలను ప్రభుత్వం గత ఏడాది ధృవీకరించింది. జిమ్స్ అనే పేరుతో ఈ ప్రభుత్వ యాప్ ను లాంచ్ చేయనుందనే అంచనాలు వెలువడ్డాయి. కానీ దేశీయంగా ‘సందేశ్’ పేరుతో తీసుకురానుందట. ఈ నేపథ్యంలోనే దీన్ని వినియోగానికి కూడా సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని మంత్రిత్వ శాఖల అధికారులు దీన్ని వాడుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఈ యాప్ అధీకృత ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితమని పేర్కొంది. ఓటీపీ ఆధారిత లాగిన్ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ సహా ఆధునిక చాటింగ్ చాప్‌ల ఫీచర్లతో ఐఓఎస్,ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలకు మద్దతునిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, (ఎన్ఐసీ) బ్యాకెండ్ సపోర్టు అందిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష