బాలీవుడ్ నటుడు రాజీవ్ కపూర్ కన్నుమూత
- February 09, 2021
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత రాజ్‌కపూర్ తనయుడు, రిషీకపూర్ సోదరుడు రాజీవ్ కపూర్ గుండెపోటుతో మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. రాజీవ్ కపూర్ కన్నుమూసిన విషయాన్ని రిషీకపూర్ భార్య నీతూ కపూర్ 'ఇన్‌స్టాగ్రామ్' పోస్టులో ధ్రువీకరించారు. రిషీకపూర్ గత ఏడాదే క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు.
'ఏక్ జాన్ హై హమ్' (1983) చిత్రంతో నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజీవ్ కపూర్.. తన తండ్రి రాజ్‌కపూర్ చివరిసారిగా దర్శకత్వం వహించిన 'రామ్ తేరీ గంగా మైలి' చిత్రంలోనూ నటించారు. అనంతరం 'ఆస్మాన్', 'లవర్ బాయ్', 'జబర్దస్త్', 'హమ్ తో చలే పరదేశ్' వంటి చిత్రల్లోనూ నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు. 1991లో రిషీకపూర్‌తో కలిసి 'హెన్నా' చిత్రాన్ని నిర్మించారు. రిషికపూర్, మాధురీ దీక్షిత్ నటించిన 'ప్రేమ్‌గ్రంథ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన 'ఆ అబ్ లౌట్ చలే' చిత్రాన్ని రాజీవ్ కపూర్ నిర్మించగా, రిషీ కపూర్ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్‌లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!
- ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్..!!
- ఒమన్ లో వైభవంగా దీపావళి వేడుకలు..!!
- బహ్రెయిన్ పోస్ట్ మొబైల్ పోస్టల్ సేవలు ప్రారంభం..!!
- కెపిటల్ గవర్నరేట్‌లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!