కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- February 13, 2026
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు మరియు మౌలిక సదుపాయాల నిధి పథకం (CRIF) కింద ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు మరియు ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి నితిన్ జైరామ్ గడ్కరి వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
మంత్రి వివరాల ప్రకారం, జాతీయ రహదారుల అభివృద్ధి మరియు నిర్వహణ ప్రధాన బాధ్యత రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖదే. అదనంగా, 2000 సవరణ CRIF చట్టం ప్రకారం రాష్ట్ర రహదారుల అభివృద్ధి, నిర్వహణ పనులు కూడా చేపడతారు. PM గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ చట్రంలో రాష్ట్రాలు ప్రాధాన్యత ఇచ్చే ప్రాజెక్టులను గుర్తించి, మంజూరు చేసి అమలు చేసే విధానం అమల్లో ఉందని తెలిపారు. పరిపాలనా, సాంకేతిక మరియు ఆర్థిక అనుమతులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే ఇవ్వబడతాయని, ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణ మరియు నాణ్యత నియంత్రణ బాధ్యత కూడా రాష్ట్రాలపైనే ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్థిక సంవత్సరాల వారీగా పనుల వివరాలు ఇలా ఉన్నాయి:
- 2022–23లో రూ.390.33 కోట్ల వ్యయంతో 224 కి.మీ పొడవున 17 పనులు మంజూరు చేయగా, రూ.204.30 కోట్లతో 116 కి.మీ మేర 8 పనులు పూర్తయ్యాయి. మరో రూ.186.00 కోట్లతో 108 కి.మీ మేర 9 పనులు కొనసాగుతున్నాయి.
- 2023–24లో రూ.482.84 కోట్లతో 62 కి.మీ మేర 9 పనులు మంజూరు కాగా, రూ.57.00 కోట్లతో 29 కి.మీ మేర 2 పనులు పూర్తయ్యాయి. రూ.425.84 కోట్లతో 33 కి.మీ మేర 7 పనులు ప్రగతిలో ఉన్నాయి.
- 2024–25లో రూ.98.00 కోట్లతో 1 కి.మీ మేర ఒక పని మంజూరు చేయబడగా, అది కొనసాగుతోంది.
- 2025–26లో రూ.49.00 కోట్లతో 21 కి.మీ మేర ఒక పని మంజూరు చేయబడగా, ఆ పని కూడా ప్రస్తుతం జరుగుతోందని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ద్వారా కొనసాగుతున్న చర్యల పై ఈ వివరాలు స్పష్టతనిచ్చాయని ఎంపీ బాలశౌరి తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







