ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- February 12, 2026
హైదరాబాద్: ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల నిరంతర స్టేడియం స్థాయి స్పోర్ట్స్ హాకథాన్® కార్యక్రమానికి సంబంధించిన అధికారిక లోగో మరియు పోస్టర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆవిష్కరించారు.మార్చి 28–29 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న ఈ వినూత్న కార్యక్రమం క్రీడలు మరియు సాంకేతిక ఆవిష్కరణలను ఒకే వేదిక పై సమన్వయం చేసే ప్రపంచ ప్రథమ ప్రయత్నంగా నిలవనుంది. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ మద్దతుతో నిర్వహించబడుతోంది.
ఈ సందర్భంగా మాట్లాడిన క్రీడా మరియు యువజన సేవల మంత్రి వాకిటి శ్రీహరి, ఈ స్పోర్ట్స్ హాకథాన్‌లో తాను స్వయంగా రెండు రోజుల పాటు పాల్గొంటానని ప్రకటించారు. రాష్ట్ర యువతను ప్రోత్సహించడం, క్రీడా రంగాన్ని బలోపేతం చేయడం మరియు తెలంగాణను క్రీడా ఆవిష్కరణల కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. “ఈ స్పోర్ట్స్ హాకథాన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర యువతకు స్ఫూర్తినిచ్చే ఉద్యమం. నేను స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యువతతో కలిసి నిలబడతాను.తెలంగాణ ప్రభుత్వం దీనికి సంపూర్ణ మద్దతు అందిస్తుంది,” అని మంత్రి పేర్కొన్నారు.
ఈ స్పోర్ట్స్ హాకథాన్‌లో తెలంగాణలోని అన్ని 33 జిల్లాల నుంచి యువత, క్రీడాకారులు, విద్యార్థులు, టెక్నాలజీ నిపుణులు, స్టార్టప్‌లు పాల్గొనేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకే స్టేడియంలో సుమారు 10,000 మంది పాల్గొనే ఈ మహత్తర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు కూడా ప్రయత్నించనుంది.ప్రత్యక్ష క్రీడా పాల్గొనికతో పాటు నిరంతర 24 గంటల ఇన్నోవేషన్ ప్రక్రియను కలిపిన ఈ వినూత్న నమూనా ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.
స్పోర్ట్స్ హాకథాన్® బ్రాండ్ యజమాని సుందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ, “క్రీడా ప్రదర్శనతో పాటు 24 గంటల నిరంతర ఇన్నోవేషన్ ప్రక్రియను ఒకే స్టేడియంలో నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ మద్దతుతో ఈ కార్యక్రమం గ్లోబల్ స్థాయిలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది.10,000 మంది పాల్గొనే వారిని ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా క్రీడా రంగ భవిష్యత్తుకు మార్గదర్శక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం,” అని తెలిపారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









