దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- February 12, 2026
భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజిక్ రహదారి ముంబయిలో ప్రారంభమైంది. దేశ రహదారి రంగంలో ఇది ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది. ముంబయి నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ కోస్టల్ రోడ్లో నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వరకు సుమారు 500 మీటర్ల మేర ఈ మ్యూజిక్ రోడ్డును ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేశారు.బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ రహదారి ప్రాజెక్ట్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేలు కలిసి బుధవారం ప్రారంభించారు.
దీంతో మ్యూజిక్ రహదారి కలిగిన జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా, యూఏఈ దేశాల సరసన భారత్ చేరింది. రహదారిపై నుంచి వాహనాలు కదులుతున్నప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జయ హో’ పాట లోపలి ఉన్నవారికి వినిపిస్తుంది.రంబుల్ స్ట్రిప్‌లను ఉపయోగించి వేసిన ఈ రహదారిపై వాహనాలు గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు టైర్లు,
రోడ్డు ఉపరితలం మధ్య పరస్పర చర్యతో శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ వైబ్రేషన్స్ కారణంగా వెలువడే ధ్వని తరంగాలు ‘జయ హో’ పాట ట్యూన్‌ను తిరిగి వినిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు బీఎంసీ రూ.6.21 కోట్లు ఖర్చు చేసింది. నారీమన్ పాయింట్ వద్ద టన్నెల్ ఎగ్జిట్ తర్వాత ప్రియదర్శిని పార్క్, అమర్‌సన్స్ గార్డెన్ మధ్యలో ఈ మ్యూజిక్ రోడ్డును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







