వంగవీటి లోగో విడుదల...
- February 25, 2016
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంగవీటి రంగా, వంగవీటి రాధ జీవిత నేపధ్యంతో వంగవీటి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రం ఎనౌన్స్ చేసినప్పటి నుండి వర్మకు బెదిరింపు కాల్స్ రావడం, దీనిపై వర్మ వివరణ ఇవ్వడం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల వంగవీటి రంగాకు సంబంధించిన ఓ లుక్‌ని కూడా రిలీజ్ చేసారు. బెజవాడ రాజకీయాల నేపధ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా, చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.వంగవీటి చిత్రాన్ని తెరకెక్కించొద్దని పలువరు వర్మకు హెచ్చరికలు చేసిన కూడా అవేమి పట్టించుకోకుండా, తన చిత్ర టైటిల్ లోగోను వర్మ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసాడు. సైకిల్ చైన్‌తో వంగవీటి లోని అక్షరాలను కలుపుతూ ఈ పోస్టర్‌ను క్రియేట్ చేయగా ఇందులో కత్తి, ఎర్ర జెండా కూడా ఉన్నాయి.ప్రస్తుతం ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు వర్మ సన్నాహాలు చేస్తుండగా, దీని తర్వాత సుదీప్ టైటిల్ రోల్లో రాయ్ అనే చిత్రాన్ని చిత్రీకరించనున్నారు రామ్ గోపాల్ వర్మ.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







