అల్లరి నరేష్ పూరి దర్శకత్వంలో...
- February 25, 2016
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యమా స్పీడు మీదున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలు చేతిలో ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ మరో రెండు సినిమాలపై చర్చిస్తున్నాడు. లోఫర్ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన పూరి, ప్రస్తుతం ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో రోగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు.రోగ్ పూర్తికాగానే కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత మరో నందమూరి హీరో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ మూడు సినిమాలను వరుసగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్కెచ్ వేస్తున్నాడు.ఈ సినిమాల వర్క్ జరుగుతుండగానే తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు.ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ సినిమా చేయడానికి ఒప్పించిన పూరి జగన్నాథ్, తాజాగా మరో హీరోను కూడా లైన్ లో పెట్టాడు. కామెడీ సినిమాల కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు పూరి. నరేష్ కూడా చాలా కాలంగా పూరి సినిమా కోసం ఎదురుచూస్తుండటంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







