ఘనంగా ప్రారంభమైన బహ్రెయిన్ అంతర్జాతీయ గార్డెన్ ప్రదర్శన
- February 25, 2016
బహ్రెయిన్ అంతర్జాతీయ గార్డెన్ ప్రదర్శన 2016 ఎంతో ఘనంగా ప్రారంభం కావడంతో ఇక్కడ సందడి నెలకొంది రంగుల రంగుల పూల మొక్కలతో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా మారింది. ఇందులో పాల్గొనే ప్రదర్శనకారులకు 7,000 చదరపు మీటర్ల విస్తీర్ణ ప్రాంగణంలో వ్యవసాయ రంగంలో వారి మేలైన ఉత్పత్తులు, వారు అందించే సేవలు, పెరటి తోటపని పద్ధతులు పూల మొక్కల సాగు, మరియు విజయవంతమైన రైతు అనుభవాలు తదితర విషయాలను ఇక్కడ వివరిస్తారు, బుధవారం బహరేన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ఒక రంగుల వేడుకలో, బోర్డు ఛైర్పర్సన్ సుప్రీం కౌన్సిల్ అధ్యక్షుడు ఖలీఫా భార్య యువరాణి సబీక బిన్తె ఇబ్రహీం అల్ పాల్గొని ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి ఏడాది మహిళలు మరియు వ్యవసాయ అభివృద్ధి పర్యవేక్షణలో ఈ జాతీయ కార్యక్రమం జరుగుతుంది, బహరేన్ అంతర్జాతీయ గార్డెన్ ప్రదర్శన గొవరవనీయ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పోషణలో ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24వ తేదీ నుండి ఫిబ్రవరి 28 వరకు జరగనుంది, వ్యవసాయ రంగంలో, ఈ తరహ పెట్టుబడులు ఆర్ధిక వ్యవస్థకు ప్రయోజనం కాగలదని ఆమె తెలిపారు. అలాగే , పరిశోధన బహరేన్, సామాజిక పర్యావరణ మరియు ఆర్ధిక పురోగతి సాధించడంలో దోహదం చేస్తుందని అన్నారు తద్వారా విజయవంతమైన వ్యవసాయ పరిసరాల మన పరిసరాలలో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఆమె 2010 లో బహరేన్ అంతర్జాతీయ గార్డెన్ ప్రదర్శన ప్రారంభం నుండి కృషి చేసిన పలువురిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు.యువరాణి సబీక బిన్తె ఇబ్రహీం అల్ ఉత్పత్తులు గురించి తెలుసుకోవడానికి షో విభాగాలు పర్యటించారు. అనంతరం ఆమె ముఖ్య కేంద్రాన్ని సందర్శించి బహరేన్ గార్డెన్స్ క్లబ్ యొక్క వార్షిక పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆమె బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు డాక్టర్ అబ్డుల్హుస్సైన్ మీర్జా ఫఅఎక బిన్తె సయీద్ అల్ సాలెహ్, ఎస్సం ఖలాఫ్, కాపిటల్ గవర్నరేట్ షేక్ హిషాం గవర్నర్, యు కె , ఫ్రాన్స్ మరియు టర్కీ రాయబారుల కూడా హాజరయ్యారు.ఈబహరేన్ అంతర్జాతీయ గార్డెన్ ప్రదర్శన ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 వరకు ప్రజల సందర్శన కోసం తెరవబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







