ట్విట్టర్‌కు పోటీ ఇవ్వనున్న దేశీ యాప్ 'కూ'
- February 10, 2021
న్యూఢిల్లీ: ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తాను సోషల్ మీడియా ప్లాట్ఫారం 'కూ'లో అకౌంట్ తెరిచినట్టు ప్రకటించారు. ఇది ఒక మేక్ ఇన్ ఇండియా యాప్ అని, దీనికి అధికారిక ట్విట్టర్‌తో పాటు మద్దతు పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలోనే కూ యాప్‌లో అకౌంట్ ప్రారంభించినట్లు తెలిపారు. ఐటీ, ఇండియా పోస్ట్‌తో పాటు పలు ప్రభుత్వ విభాగాల్లో ఈ ప్లాట్‌ఫారంపై హ్యాండిల్ వెరిఫై చేశారు. కూ అనేది ట్విట్టర్ తరహాలోని మరో యాప్. ఇది 10 నెలల క్రితమే ఆవిష్కృతమయ్యింది. ఇది ఆత్మనిర్భర్ యాప్ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచింది. ఈ యాప్ అపారమేయ రాధాకృష్ణ, మయంక్ బిదావడ్కాలు అభివృద్ధి చేశారు. ఈ యాప్ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒడిశా, అస్సామీ తదితర భాషలలో అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో దీని డౌన్లోడ్ పేజ్‌లో ఉన్న వివరాల ప్రకారం 'కూ'ను భారతీయులు తమ మాతృభాషలో అభిప్రాయాలను వెల్లడించేందుకు, చర్చించేందుకు రూపొందించారు. కాగా గత కొంతకాలంగా ట్విట్టర్.. భారత ప్రభుత్వం మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే ట్విట్టర్ ఇండియాకు చెందిన పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ రాజీనామా చేశారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







