'బజార్ రౌడీ' ఫస్ట్ లుక్ విడుదల

- February 10, 2021 , by Maagulf
\'బజార్ రౌడీ\' ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్:'హృదయకాలేయం'తో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే కామెడీ స్టార్ గా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేశ్ బాబు.పేరడీ సీన్స్ తో బర్నింగ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సంపూ ఆ తర్వాత సింగం 123, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లో హీరోగా 'కరెంట్ తీగ, బందిపోటు, జ్యోతిలక్ష్మి, పెసరట్టు, రాజా ది గ్రేట్, దేవదాస్, కథనం' వంటి సినిమాలలో కేమియో రోల్స్ లో కనిపించి అలరించాడు.ఇక బిగ్ బాస్ కి వెళ్ళి హంగామా చేసి బయటకు వచ్చిన సంపూర్ణేశ్ తాజాగా మరో సినిమాతో ఆడియన్స్ ముందుక రాబోతున్నాడు.ఈ సినిమాకు 'బజార్ రౌడీ' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమా ఫస్ట లుక్ తో పాటు మోషన్ పోస్టర్ తాజాగా విడుదలయ్యాయి.ఈ మోషన్ పోస్టర్ ముందుగా చార్మినార్‌తో మొదలవుతోంది.ఈ పోస్టర్‌లో మంచంపై పడుకొని సిగిరెట్ వెలిగించుకుంటూ సంపూర్ణేష్ బాబు కనిపిస్తున్నారు.సినిమాపై ఉన్న అంచనాలను ఈ పోస్టర్ రెట్టింపు చేస్తోంది.మరి సినిమా అనుకున్న స్థాయిలో రాణిస్తుందేమో వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com