కోవిడ్ 19: రస్ అల్ ఖైమాలో వెడ్డింగ్, ఈవెంట్ హాల్స్ మూసివేత

- February 11, 2021 , by Maagulf
కోవిడ్ 19: రస్ అల్ ఖైమాలో వెడ్డింగ్, ఈవెంట్ హాల్స్ మూసివేత

రస్ అల్ ఖైమా:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో వెడ్డింగ్ మరియు ఈవెంట్ హాల్స్‌ని మూసివేస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం తీసుకుంది.ఫిబ్రవరి 10 నుంచి రస్ అల్ ఖైమాలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని రస్ అల్ ఖైమా ఎకనమిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది. మార్చి 5 వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి.ఫ్యామిలీ మరియు సోషల్ గేదరింగ్స్ నిమిత్తం 10 మందికి, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తూ రస్ అల్ ఖైమా నిర్ణయం ప్రకటించిన విషయం విదితమే.కాగా, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సి వుంటుందని అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com