ఇల్లందులో ‘ఆచార్య’ షూటింగ్ కు ఏర్పాట్లు
- February 12, 2021
ఖమ్మం:మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ ఇల్లందు జేకే మైన్స్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 7 నుండి 15వ తేదీ వరకు ఇల్లందు జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్ మరియు అండర్ గ్రౌండ్ మైనింగ్ లో షూటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో చిత్ర హీరో చిరంజీవి, రాంచరణ్ పై సన్నివేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అందుకు తగు అనుమతులు కల్పించాలని చిత్ర దర్శకుడు కొరటాల శివ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ చిత్ర షూటింగ్ కోసం స్థానికంగా అనుమతులతో పాటు చిత్ర హీరో చిరంజీవికి తానే తన నివాసంలో ఆతిధ్యం ఏర్పాటు చేస్తామని వారికి తెలిపారు. మిగతా జిల్లాలతో పోల్చితే పర్యాటక రంగంగా ఉమ్మడి ఖమ్మం అభివృద్ధి చెందిందని, వివిధ చిత్రాల షూటింగ్ ల కోసం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అనువైన ప్రదేశమని కొరటాల శివ పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఖమ్మం స్వరూపం పూర్తిగా మారిపోయిందని అందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష