సౌదీ, ఖతార్ మధ్య ఫిబ్రవరి 14 నుంచి వాణిజ్యం తిరిగి ప్రారంభం

- February 13, 2021 , by Maagulf
సౌదీ, ఖతార్ మధ్య ఫిబ్రవరి 14 నుంచి వాణిజ్యం తిరిగి ప్రారంభం

రియాద్:దౌత్య సంబంధాల పునరుద్ధరణ తర్వాత గల్ఫ్ దేశాలతో ఖతార్ మైత్రి బంధం బలపడేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం వెలువడింది. ఫిబ్రవరి 14 నుంచి సౌదీతో వాణిజ్య సరుకుల రవాణా పున:ప్రారంభం కానుంది. అబు సమ్రా సరిహద్దు ద్వారా సరుకుల రవాణా జరగనున్నట్లు ఖతార్ కస్టమ్స్ జనరల్ అథారిటీ ప్రకటించింది. పోర్టుల ద్వారా సరుకు రవాణాకు గత నెలలోనే ద్వారాలు తెరిచిన ఇరు దేశాలు...దానికి కొనసాగింపుగానే అబు సమ్రా సరిహద్దు మీదుగా సరుకు రవాణాను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. సౌదీలోని సాల్వా పోర్టు, ఖతార్ లోని అబు సామ్రా పోర్టు ద్వారా సాధారణ వస్తు రవాణా కొనసాగుతుందని అయితే, కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలతో తాము సిద్ధంగా ఉన్నట్లు వివరించింది. తమ పరిధిలోని పోర్టుకు వచ్చే ట్రక్ డ్రైవర్లు అందరూ సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ గుర్తింపు పొందిన ల్యాబ్ ల నుంచి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. పోర్టుకు చేరుకునే సమయానికి మూడ్రోజుల్లోపు చేయించుకున్న టెస్టు రిపోర్టులనే పరిగణలోకి తీసుకుంటాని స్పష్టం చేసింది. నెగటీవ్ రిపోర్ట్ ఉన్నవారినే పోర్టుకు అనుమతిస్తామని, అదే సమయంలో అక్రమ రవాణా, ప్రమాదకర సరుకుల రవాణాను నియంత్రించేందుకు ట్రక్కులోని సరుకులను తనఖీలు చేపడతామని ఖతార్ తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com