30 KDలకు పీసీఆర్ ఫేక్ సర్టిఫికెట్..ఇండియన్ ల్యాబ్ టెక్నిషియన్ అరెస్ట్
- February 13, 2021
కువైట్ సిటీ:గల్ఫ్ దేశాల్లో దాదాపు అన్ని వ్యవహారాలకు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అవుతోంది. ఇక విమాన ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఈ డిమాండ్ ను అసరాగా చేసుకొని అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు ఏకంగా పీసీఆర్ రిపోర్ట్ లను ఫోర్జరీ చేసి పట్టుబడ్డాడో ఇండియన్. కువైట్ లోని ఫర్వానియా గవర్నరేట్లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ లో నిందితుడు ల్యాబ్ టెక్నిషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నిందితుడు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను ఫోర్జరీ చేసి నెగటీవ్ రిపోర్ట్ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో ఫేక్ సర్టిఫికెట్ కు 30 దినార్లను అమ్ముకున్నాడని వివరించారు. ఇప్పటివరకు 60 సర్టిఫికెట్లను పలువురికి అమ్మినట్లు తమ విచారణలో వెల్లడైందని, ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశామన్నారు. అయితే..పీసీఆర్ ఫేక్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన వారు ఎవరు అనేది ఆరా తీస్తున్నామన్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఇప్పటికే కొందరు దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించామని, ఇక కువైట్లో ఉన్నవారి కోసం ఆరా తీస్తున్నామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష