ఈ నెల 27 వరకు రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ
- February 13, 2021
గుజరాత్:అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఇప్పటివరకూ రూ.1,500 కోట్లకు పైగా విరాళాలు అందాయని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది.ఈ నెల 27 వరకు విరాళాలను సేకరిస్తారు.దేశవ్యాప్తంగా రామ జన్మభూమి ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్ తో పాటు పలు హిందూ సంఘాలు విరాళాల సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రతి హిందువునూ రామాలయ నిర్మాణంలో భాగస్వామిని చేయాలని రామ జన్మభూమి ట్రస్ట్ భావిస్తోంది.
తద్వారా రామాలయం దేశ ప్రజలందరిదనే సందేశాన్ని చాటాలనుకుంటోంది.రూ.1,500 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్లాన్ వేసుకున్నారు.ఇప్పటికే భక్తుల నుంచి అంతకు మించి విరాళాలు వచ్చాయి. హిందువులే కాకుండా పలు మతాలకు చెందిన వారు కూడా రాముడి మందిరం కోసం విరాళాలు ఇస్తున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొలి విరాళం ఇవ్వడంతో ప్రారంభమైన విరాళాల కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్నటివరకు 1,511 కోట్ల రూపాయాలు విరాళాలు అందాయని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది.
కాగా, మరికొన్ని రోజులే విరాళాల సేకరణకు గడువు ఉండడంతో ఈ కాలంలో మరిన్ని కోట్ల రూపాయలు రానున్నాయి.ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు.దేశంలోని పలు ప్రాంతాల నుంచి వెండి ఇటుకలను కూడా పంపుతున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







