కువైట్ లో ప్రవాసీయుడి అరెస్ట్..356 మద్యం బాటిళ్లు సీజ్
- February 13, 2021
కువైట్ సిటీ:అక్రమంగా మద్యం బాటిళ్లను కలిగి ఉన్న ఓ ప్రవాసీయుడ్ని అరెస్ట్ చేసినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితుడి దగ్గర్నుంచి 356 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. హవాలీ ప్రాంతంలో పోలీసులు పాట్రోలింగ్ చేస్తుండగా మద్యం బాటిళ్ల బాగోతం బయటపడింది. సాధారణ పాట్రోలింగ్ లో భాగంగా అటుగా వెళ్తున్న పోలీసులు..ముగ్గురు వ్యక్తుల తీరు అనుమానస్పదంగా కనిపించింది. ఆ ముగ్గురు వ్యక్తులు ఒక వాహనం నుంచి మరో వాహనంలోకి ఎక్కువ సంఖ్యలో బ్యాగులను మార్చుతున్నట్లు గమనించిన పోలీసులు..బ్యాగుల విషయమై ఆరా తీసేందుకు వాహనాల దగ్గరికి వెళ్లారు. అయితే..పోలీసులు తమ వైపే వస్తుండటాన్ని గమనించిన నిందితులు బ్యాగులను అక్కడే పడేసి పరుగందుకున్నారు. మొత్తం ముగ్గురు నిందితుల్లో ఇద్దరు తప్పించుకొని పారిపోగా..ఓ వ్యక్తిని మాత్రం పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. బ్యాగులను తనిఖీ చేయగా అందులో 356 ఇంపోర్టెడ్ లిక్కర్ బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ఆరా తీస్తున్నామని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







