లైసెన్స్ లేని న్యూస్ అకౌంట్లపై ఫైన్..కువైట్ కోర్టు తీర్పు
- February 14, 2021
కువైట్ సిటీ:ఎలాంటి అనుమతులు లేకుండా, లైసెన్స్ తీసుకోకుండా సోషల్ మీడియాలో న్యూస్ అకౌంట్లను నిర్వహిస్తే జరిమానా ఎదుర్కొవాల్సిందేనని కువైట్ న్యాయ వ్యవస్థ హెచ్చరించింది.ట్విట్టర్ లో అతీజ్ అల్-మాసియన్ అనే పేరుతో న్యూస్ అకౌంట్ ను నిర్వహిస్తున్న వ్యక్తికి 5000 దినార్ల జరిమాన విధిస్తూ అప్పీల్ కోర్టు, క్రిమినల్ కోర్టు గతంలో తీర్పునిచ్చాయి. అయితే..ఈ తీర్పును నిందితుడు సవాల్ చేయటంతో కేసు పూర్వపరాలను పరిశీలించిన కోర్ట్ ఆఫ్ కాసేషన్...నిందితుడికి 5000 దినార్ల జరిమానా విధించటాన్ని సమర్ధించింది. జ్యూడిషియరీ రెగ్యూలేషన్స్ మేరకు లైసెన్స్ లేకుండా న్యూస్ అకౌంట్ల నిర్వహణ నేరమేనని స్పష్టం చేసింది.అయితే..సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఎమిరాతిలను అవమానించేలా, జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలు, పుకార్లను ప్రసారం చేశారనే ఆరోపణలను మాత్రం తోసిపుచ్చింది.ఈ ఆరోపణల్లో ప్రతివాదులు నిర్దోషులు అని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







