‘రాధేశ్యామ్’ టీజర్ విడుదల
- February 14, 2021
హైదరాబాద్:ప్రేమికుల రోజున ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు గుడ్న్యూ్స్ వచ్చేసింది.ప్రభాస్ హీరోగా పూజాహెగ్డె హీరోయిన్గా నటించిన ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదలైంది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘డార్లింగ్’ చిత్రాల తర్వాత ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా టీజర్ కోసం అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ‘రాధేశ్యామ్’ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ‘రాధేశ్యామ్’కు కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల తర్వాత ఇందులో ప్రభాస్ లవర్‌బాయ్‌గా సాఫ్ట్ లుక్‌లో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు.ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే.. ప్రేరణగా మెప్పించనున్నారు.పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







