ఒమన్ కు చేరిన 17,550 ఫైజర్ వ్యాక్సిన్
- February 14, 2021
మస్కట్:కోవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ బయోన్టెక్ సెకండ్ బ్యాచ్ శనివారం రాత్రికి సుల్తానేట్ కు చేరుకున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండో విడతలో భాగంగా మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 17,550 డోసుల వ్యాక్సిన్ వచ్చినట్లు స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే తొలి డోసు తీసుకున్న వారికి ఆదివారం నుంచి రెండో డోసును ఇవ్వనన్నట్లు వెల్లడించింది. ఇందుకోసం సుల్తానేట్లోని గవర్నరేట్ల పరిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఫైజర్ టీకాల పంపిణిని నిన్న రాత్రి నుంచే ముమ్మరం చేసినట్ల ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఇదిలాఉంటే..తొలిదశలో భాగంగా ఫైజర్ బయోన్టెక్ టీకాలను 24,773 మందికి ఇచ్చామన్నారు. అంటే లక్ష్యంగా ఎంచుకున్న వర్గంలో 98 శాతం మందికి వ్యాక్సిన్ అందిందని...ఇక అదే వ్యాక్సిన్ ను రెండో డోసుగా ఇప్పటివరకు 12,272 మంది తీసుకున్నారని వివరించారు. నిర్దేశిత లక్ష్యంలో ఇది 46 శాతమన్నారు. ప్రస్తుతం రెండో బ్యాచ్ వ్యాక్సిన్ కూడా ఒమన్ చేరుకోవటంతో రెండో డోసును ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష