వాలెంటైన్స్‌డే స్పెషల్..జంటగా మారిన బిగ్‌బాస్ ఫేం మోనాల్-అఖిల్
- February 14, 2021
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో మోనాల్, అఖిల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ మచ్చట్ల కోసమే షోని వీక్షించినవారు ఉన్నారు. ఇక మోనాల్, అఖిల్, అభిజిత్ మధ్య జరిగిన ట్రయాంగిల్ లవ్ షోని ఎంత రక్తి కట్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాల్గో సీజన్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చాక కూడా అదే ప్రేమానుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా బిగ్‌బాస్ లవ్ కపుల్‌గా పేరొందిన మోనాల్ గజ్జర్-అఖిల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ ఏర్పడింది. వీరిద్దరు కూడా అదే బాండ్‌ను కొనసాగిస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. షో నుంచి బయటకు వచ్చాక పార్టీలు చేసుకొని ఆ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇలా బుల్లితెరపై, సోషల్ మీడియాలో సందడి చేసిన ఈ లవ్ కపుల్..వాలెంటైన్స్‌డే సాక్షిగా జంటగా మారబోతున్నట్లు ప్రకటించారు.
అయితే వీరు జంటగా మారబోతున్నది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. వీరిద్దరు కలిసి ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సీరిస్‌లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఆదివారం ప్రకటిస్తూ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ వెబ్ సిరీస్‌కి భాస్కర్ బంతుపల్లి దర్శకత్వం వహిస్తుండగా, ఏ భాస్కరరావు నిర్మిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తూ.. ‘బిగ్ డే.. మీ ఆశీర్వాదం కావాలి' అంటూ అభిమానులను కోరారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష