వాట్సాప్:2021లో రాబోయే కొత్త ఫీచర్లు
- February 14, 2021
ప్రపంచంలో కోట్ల సంఖ్యలో యూజర్లు వినియోగిస్తున్న యాప్ లలో వాట్సాప్ యాప్ ఒకటి.ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ యాప్ యూజర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మరికొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.రాబోయే రోజుల్లో యూజర్లకు మెరుగైన అనుభవాన్ని పంచేందుకు వాట్సాప్ ఐదు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సాప్ అతి త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్న ఫీచర్లలో వాట్సాప్ లాగ్అవుట్ ఫీచర్ కూడా ఒకటి. వాట్సప్ బీటా ఇన్ఫో నివేదికల ప్రకారం వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ ద్వారా ఫోన్ లేకుండా వాట్సాప్ ను వినియోగించవచ్చు.వెబ్ ద్వారా వాట్సాప్ యాప్ ను వినియోగించే వారికి ఈ ఫీచర్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.వాట్సాప్ యూజర్ల కొరకు తెచ్చిన మరో అద్భుతమైన ఫీచర్ వాట్సాప్ మల్టీ-డివైస్ ఫీచర్.
వాట్సాప్ మల్టీ-డివైస్ ఫీచర్ కోసం యూజర్లు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.ఈ ఫీచర్ సహాయంతో ఒకటి కంటే ఎక్కువ పరికరాల్లో ఒకే నంబర్ నుంచి వాట్సాప్ లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం మొబైల్ లో మాత్రమే వాట్సాప్ లాగిన్ అయ్యే అవకాశం ఉండగా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతుంది. వాట్సాప్ ఐఓఎస్ యూజర్ల కొరకు పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.
ఈ ఫీచర్ ద్వారా మల్టీపుల్ ఫోటోలను, వీడియోలను కాపీ చేసి చాట్ లో పేస్ట్ చేసుకోవచ్చు.వాట్సాప్ రీడ్ లేటర్ ఫీచర్ ద్వారా ఆ కాంటాక్ట్ లేదా గ్రూప్ యొక్క నోటిఫికేషన్లు రాకుండా చేయవచ్చు.వాట్సాప్ మ్యూట్ వీడియోలు, వాట్సాప్ వెబ్‌లో వాయిస్ మరియు వీడియో కాల్స్ ఫీచర్లు కూడా త్వరలో వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష