మార్చి 19న విడుదల కానున్న 'మ‌యూరాక్షి'

- February 15, 2021 , by Maagulf
మార్చి 19న విడుదల కానున్న \'మ‌యూరాక్షి\'

హైదరాబాద్:`భాగ‌మ‌తి` ఫేం ఉన్ని ముకుంద‌న్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా మ‌ల‌యాళంలో రూపొందిన `ఐరా` అనే చిత్రాన్ని `మ‌యూరాక్షి` పేరుతో తెలుగులోకి అనువ‌దించారు నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్.సూప‌ర్ హిట్ చిత్రాల సంగీత ద‌ర్శకుడు గోపీసుంద‌ర్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌లు విడుదలయ్యాయి.ముఖ్య అతిథులుగా విచ్చేసిన ద‌ర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు కె.అచ్చిరెడ్డి, శివ‌లెంక కృష్ణ ప్రసాద్ బిగ్ సీడీని ఆవిష్కరించారు.పాట‌లు, ట్రైల‌ర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయంటూ.... థ్రిల్లర్ చిత్రాలను తెలుగు వారు ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటారని... ఈ చిత్రం కూడా పెద్ద స‌క్సెస్ సాధించి నిర్మాత‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నామన్నారు ముఖ్యఅతిథులు.మార్చి 19న ఈ చిత్రం విడుద‌ల‌ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com