'సర్కారు వారి పాట' సెకండ్ షెడ్యూల్ కోసం దుబాయ్ చేరుకున్న కీర్తి సురేష్

- February 15, 2021 , by Maagulf
\'సర్కారు వారి పాట\' సెకండ్ షెడ్యూల్ కోసం దుబాయ్ చేరుకున్న కీర్తి సురేష్

దుబాయ్‏:సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మొదటి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్‏లో శరవేగంగా పూర్తిచేసుకుంది.తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ రేపు ప్రారంభం కానుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుంది. తాజాగా ‘సర్కారు వారి పాట’ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‏లో పాల్గొనేందుకు కీర్తి దుబాయ్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోను కీర్తి తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. కాగా ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ను ఇప్పటివరకు చూడని కొత్త లుక్ లో చూపించబోతున్నారని తెలుస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది.కాగా మైత్రీ మూవీ మేకర్స్‌,14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com