కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభం
- February 15, 2021
హైదరాబాద్:మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు.మార్చి రెండోవారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ మూవీ ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కాకుండా కళ్యాణ్ రామ్ మరో రెండు ప్రాజెక్ట్స్ మీద కూడా దృష్టిపెట్టాడు. మల్లిడి వశిష్ట్ తో 'రావణ్' పేరుతో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్నాడనే ప్రచారం కొంతకాలంగా గట్టిగా వినిపిస్తోంది. అలానే మలయాళ చిత్రం 'అంజామ్ పత్తిర' నూ కళ్యాణ్ రామ్ తెలుగులో రీమేక్ చేస్తాడనే వార్తలూ వచ్చాయి. దాని అప్ డేట్ ఈ మధ్య కాలంలో ఏదీ లేదు. కానీ... 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ మూవీ చేస్తాడని అంటున్నారు.కళ్యాణ్ రామ్ డిటెక్టీవ్ గా నటించే ఈ సినిమా 'ఏజెంట్ వినోద్' పేరుతో తెరకెక్కనుంది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సొంతంగా తీస్తాడట. 1940 బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ థ్రిల్లర్ మూవీ ఉంటుందట.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష