బహ్రెయిన్ ప్రభుత్వ పాతశాలల్ల్లొ ఇక విదేశీయుల పిల్లలకు ఫీజుల వసూలు

- February 25, 2016 , by Maagulf
బహ్రెయిన్ ప్రభుత్వ పాతశాలల్ల్లొ ఇక విదేశీయుల పిల్లలకు ఫీజుల వసూలు

తమలపాకుతో నీవు ఒకటి కొడితే....తలుపు చెక్కతో నేనూ ఒకటి కొడతానని వెనకటికి ఒకరన్నారట అదేవిధంగా  ' కంటికి కన్ను ' సిద్ధాంతంను బహ్రెయిన్ చట్టసభ సభ్యులు చేయనున్నారు.  ఇకపై ప్రభుత్వ పాతశాలల్ల్లొ చదువుకొనే విదేశీయుల పిల్లల నుంచి ఫీజులను రాబట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.  దీని ప్రకారం బహ్రెయిన్ లో  విదేశీయుల పిల్లలు ఇక ప్రభుత్వ పాతశలలొ నిర్ణయించిన ఫీజులను తప్పనిసరిగా కట్టవలసి ఉంది, ఈ ప్రతిపాదనను పార్లమెంటరీ సభ్యుల బృందం ప్రవేశ పెట్టింది. బహ్రెయిన్ దేశాలకు చెందిన విద్యార్ధులు గతంలోను ప్రస్తతం విదేశాలలో చాదువుకోనేందుకు వెళితే, అక్కడ విదేశీయులు అధిక ఫీజులను వసూలు చేసారు కనుక ఆయా దేశాలకు చెందిన వారు తమ బహ్రెయిన్ దేశంలో ఉద్యోగ ఉపాధి నిమిత్తం వచ్చినపుడు వారి పిల్లలకు  ప్రభుత్వ పాతశాలలొ ఎందుకు ఉచిత విద్యను ఇవ్వాలని వారు తమ నివేదికలో ప్రశ్నిసిస్తున్నారు. వారిచేత ప్రభుత్వం తప్పనిసరిగా ఆయా ఫీజులను కట్టించాలని సూచిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం శాసన మరియు న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఈ ప్రతిపాదనను రాజ్యాంగ కోణం నుంచి పరిశీలించిన తర్వాత ఆమోదిం చేయనున్నారు. ఈ ప్రతిపాదనను బహ్రెయిన్ రాజ్యంలో విద్యా సేవలకు సంబంధించి 2005 వ సంవత్సరం కు  చెందిన 27వ న్యాయాధికరణను సవరించాల్సి ఉంది. ప్రస్తుత చట్ట ప్రకారం ప్రాధమిక మరియు మాధ్యమిక విద్య  బహ్రెయిన్ రాజ్యంలో అన్ని ప్రభుత్వ పాటశాలల్లో విద్యార్ధులకు ఉచితంగా అందించాల్సి ఉంది. అయెతే ప్రస్తుత చట్ట సవరణ ద్వారా ఇకపై ప్రభుత్వ పాతశాలలొ బహెరిన్ దేశానికి చెందని విద్యార్ధుల నుంచి ఫీజులను కట్టించుకోనేలా చర్యలు తీసుకోనున్నారు. ఆ ఫీజును ఎంత వసూలు చేయాలనేది సంబంధిత విద్యా మంతిత్వశాఖ నిర్ణయం మేరకు అమలు జరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com