కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 600 మందిపై కేసుల నమోదు
- February 16, 2021
దోహా:కరోనా వ్యాప్తిని అరికట్టేందుకోసం అమల్లోకి తెచ్చిన నిబంధనల్ని ఉల్లంఘిస్తోన్నవారిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది అధికార యంత్రాంగం.ఈ మేరకు అవసరమైన రీతిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.తాజాగా నిర్వహించిన తనిఖీల్లో అధికారులు 637 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది.వీరిలో 557 మంది మాస్కులు ధరించలేదని అధికారులు తెలిపారు.వాహనాల్లో పరిమతికి మించి ప్రయాణిస్తున్నవారికి సంబంధించి 59 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు 13,426 మంది ఫేస్ మాస్కులకు సంబంధించిన ఉల్లంఘనకుగాను, 490 మంది పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణిస్తున్నందుకుగాను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది.సోషల్ డిస్టెన్సింగ్ పాటించని ఆరుగురు వ్యక్తుల్ని కూడా రిఫర్ చేశారు. మరో ఆరుగురు వ్యక్తులు హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. 9 మంది ఎహ్తెరాజ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోనందుకు బుక్కయ్యారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







