ఘోర రోడ్డు ప్రమాదం-కాలువలోకి దూసుకువెళ్లిన బస్సు..
- February 16, 2021
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్లోని సిధి ప్రాంతంలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. 57 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి కెనాల్ లోకి పడిపోయింది.ఈ బస్సు సిద్ధి నుండి సాత్నాకు వెళుతుండగా పట్నా వద్ద అదుపుతప్పి కాల్వలో పడింది.
కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు కొంత దూరం కొట్టుకుపోయింది. కాలువలోకి బస్సు పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే నీటిలోకి దూకి ప్రయాణీకుల్లో ఎడుగురిని కాపాడారు.ఈ ఘటనలో 32 మంది దుర్మరణం చెందారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటన పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, పోలీసులు,గత ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో కెనాల్ నుండి బస్సును బయటకు తీశారు.కెనాల్‌లో నీటి ప్రవాహాన్ని ఆపేసి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.మృతదేహాలను వెలికి తీస్తున్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు