భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 17, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కొంతమేర కంట్రోల్ అయ్యింది.అయితే, నిన్నటి బులెటిన్ ప్రకారం దేశంలో కేసులు 9వేలకు దిగువున నమోదుకాగా, ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో కొత్తగా 11,610 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కి చేరింది.ఇందులో 1,06,44,858 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,36,549 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 100 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,55,913కి చేరింది.ఇక ఇదిలా ఉంటె దేశంలో ఇప్పటి వరకు 90 లక్షలకు పైగా కరోనా వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







