తమన్ విడుదల చేసిన 'ఎ' సినిమా పాట!

- February 17, 2021 , by Maagulf
తమన్ విడుదల చేసిన \'ఎ\' సినిమా పాట!

హైదరాబాద్:‘‘సిలకా సిగురు సాటుకు పోకే...సెలికాని ఎద‌గూటికి రాయె, జ‌డ కుచ్చుల‌లోన న‌ల‌గాల‌ని ఉందె, ఒడిలో త‌ల‌వాల్చి ఒద‌గాల‌ని ఉందె రాయె..’’ అని ప్రియుడు త‌న ప్రియురాలి కోసం పాట పాడుకుంటే ఎలా ఉంటుంది! మ‌న‌సు క‌ర‌గ‌ని ప్రియురాలు ఉంటుందా!! త‌న ప్రేమ‌నంతా పాట‌లో కురిపించే ప్రియుడు మ‌న‌సు లోతును తెలుసుకోవ‌డానికి ప్రియురాలు ఏం చేసింది?  ఇదే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘ఎ’. యుగంధ‌ర్ ముని ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ  సైన్స్ ఫిక్షన‌ల్ థ్రిల్లర్ మూవీలో నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటించారు. గీతా మిన్సాల ఈ చిత్ర నిర్మాత. విజ‌య్ కురాకుల సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలో ‘సిలకా సిగురు సాటుకు పోకే.. .’ పాట‌ను మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేసి సినిమా పెద్ద హిట్ కావాల‌ని యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను దీపు పాడారు. జానపదం స్టైల్లో సాగుతున్న పాట ప్రేకకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేసిన ‘A’ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోందని, సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 5న విడుద‌ల చేస్తున్నామ‌ని నిర్మాత తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com