సౌదీ: ఈ వీకెండ్ లో కొన్ని చోట్ల హిమపాతం, మరికొన్ని చోట్ల భారీ వర్షం
- February 18, 2021
సౌదీ అరేబియా వ్యాప్తంగా రాబోయే ఒకట్రెండు రోజుల్లో కొన్ని చోట్ల హిమపాతం, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడి వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. తబుక్ తో పాటు ఈశాన్యంలోని సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ద్వారా సమాచారం అందినట్లు కింగ్డమ్ సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో సౌదీ రాజధాని రియాద్ తో పాటు మక్కా, మదీనా, తర్పు ప్రావిన్స్, ఖసీమ్, తబుక్, అసిర్, అల్ బహ, జజన్, నజ్రన్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండటంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ముంపునకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







