మస్కట్:అనుకున్నదాని కంటే తక్కువ మొత్తంలో కరెంట్ బిల్లులు
- February 18, 2021
మస్కట్:సబ్సిడీలు ఎత్తివేసి కొత్త టారీఫ్ లను అమలు చేయటంతో కరెంట్ బిల్లు పేలిపోతుందని ఆందోళన పడిన వినియోగదారుల అంచనాలు తలకిందులయ్యాయి. ముందస్తుగా అనుకున్న దాని కంటే తక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లులు వచ్చాయి. ప్రభుత్వ రాబడిని పెంచే సంస్కరణ చర్యల్లో భాగంగా విద్యుత్, నీటి సరఫరాపై అందిస్తున్న సబ్సిడీలను ఒమన్ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచే కొత్త టారిఫ్ రేట్లను కూడా అమల్లోకి తెచ్చింది. అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ ప్రకారం, జాతీయ రాయితీలు పొందే పౌరులకు 2000 kWh / h కి 15 Bz గా విద్యుత్ పన్నును నిర్ధారించింది. అలాగే 4000 kWh కంటే ఎక్కువ వినియోగానికి 30 Bzగా పన్ను రేటును నిర్ణయించింది. అయితే..జనవరిలో జారీ అయిన బిల్లులలో 2000 kWh కు 10 Bz, 4000 kWh కంటే ఎక్కువ వినియోగానికి 20 Bz గా బిల్లులు వచ్చాయి.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







