సోను సూద్ పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రసంశలు
- February 18, 2021
హైదరాబాద్:ప్రముఖ నటుడు సోను సూద్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కేంద్రానికి బుధవారం విచ్చేశారు.ఆయన పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రసంశలు కురిపించారు.కోవిడ్ టైమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్,సింగర్ స్మిత చాలా సహాయం చేసారు అని ఆయన ఒనియాడారు.కరోన తగ్గిపోతున్న సమయంలో వలంటీరీలకు సన్మానం చేయాలి అనుకున్నాం అని అన్నారు.అప్పుడు ఎవరైనా గెస్ట్ ని పిలవాలి అనుకుంటే అందరూ చెప్పిన ఒకేఒక్క పేరు సోనూసూద్ అని ఆయన అన్నారు. వెంటనే కామన్ ఫ్రెండ్ ద్వారా ఆయన్ను కలిసి కార్యక్రమానికి రావాలి అనగానే ఆయన ఒప్పుకున్నారు అని తెలిపారు.
సోనూసూద్ లాక్డౌన్ టైమ్ లో చేసిన పనులు ప్రతి ఒక్కరికి తెలిసిందే అని అన్నారు. నేను కూడా టీవీలో చూసి ఆశ్చర్యపోయాను అని వివరించారు. ఇంత సేవాగుణం ఒక మనిషి లో ఉంటాదా అని ఆయన కొనియాడారు. ఈరోజు మేము ఇంత సక్సెస్ గా ప్లాస్మా డోనేట్ కార్యక్రమం చేయటానికి కారణం వలంటరీలే అన్నారు. వాళ్ళ ను ముందుకు నడిపిన ప్రతి వాలంటరీ తల్లి తండ్రులకు నేను ధన్యవాదాలు చెపుతున్నాను అని ఆయన వివరించారు.తెలంగాణ ప్రభుత్వం చాలా సహాయం చేసింది అని ఆయన కొనియాడారు.
కోవిడ్ టైమ్ లో ముక్యంగా తెలిసింది ఏంటి అంటే ఈ ప్రపంచంలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు అని ఆయన అన్నారు. మానవాళి తో పాటు జంతువులు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి ఈ లాక్డౌన్ లో అని ఆయన వివరించారు. అందుకే మేము కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసాము అని ఆయన అన్నారు. రోజు వీధి కుక్కలకు పిల్లులకూ ఫుడ్ ప్యాకేట్స్ పంపేవాళ్ళం అని ఆయన అన్నారు. ప్లాస్మా అంటే బయట ఎంతో ఖరీదు తో ఉన్న పని అని తెలిపారు. అప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఆచరణలో పెట్టి మా పోలీసులు అలాగే స్వచ్చంధ సంస్థలతో కలిసి ఈ ప్లాస్మా కార్యక్రమం స్టార్ట్ చేసి ప్లాస్మా ఇవ్వగలిన వ్యక్తి కావలసిన వ్యక్తిని దగ్గర చేసి ఉచితంగా ప్లాస్మా అందించామని చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష