అంధకారంలో లెబనాన్‌ ..

- February 18, 2021 , by Maagulf
అంధకారంలో లెబనాన్‌ ..

బీరట్:భారీ హిమపాతం కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలోని దేశమైన లెబనాన్‌లో చీకటి అలముకుంది. హై ఓల్టేజీతో లెబనాన్‌లోని పవర్‌ గ్రిడ్స్‌ కుప్పకూలాయని జాతీయ పవర్‌ కంపెనీ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం..బుధవారం 4.35 గంటలకు ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. దీంతో అన్ని పవర్‌ జనరేటింగ్‌ స్టేషన్స్‌కు పవర్‌ గ్రిడ్‌కు సంబంధాలు తెగిపోయాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com