కువైట్ హెల్త్ మినిస్టర్ తో ఇండియన్ అంబాసిడర్ భేటీ
- February 18, 2021
కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బాసిల్ అల్ సబాతో కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కువైట్లో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్ లో కరోనా తీవ్రత..కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వ్యాక్సిన్ ఉత్పత్తి తదితర అంశాలను కువైట్ ఆరోగ్య మంత్రికి సిబి జార్జ్ వివరించారు. భారత్ ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకాను కువైట్ దిగుమి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 2 లక్షల డోసులను దిగుమతి చేసుకుంది కువైట్. అతి త్వరలోనే మరో బ్యాచ్ కూడా దిగుమతి కానుంది. వ్యాక్సిన్ సరఫారా వేగవంతంగా జరగేందుకు రాయబార కార్యాలయం చేస్తున్న కృషిని బాసిల్ అల్ సబా ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలాఉంటే..కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ప్రయాణ నిషేధం విధించటంపై కూడా సిబి జార్జ్ కువైట్ ఆరోగ్య మంత్రితో చర్చించారు. భారత్ నుంచి ప్రయాణికులను నేరుగా అనుమతించకపోవటం వల్ల చాలా మంది ఇండియాలోనే చిక్కుకుపోయారని సిబి జార్జ్ వివరించారు. అదే సమయంలో దుబాయ్ నుంచి కువైట్ చేరుకుంటున్న వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







