కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరిన సౌదీ
- February 18, 2021
సౌదీ: కోవిడ్ వ్యాక్సినేషన్ను సౌదీ అరేబియా మరింత ముమ్మరం చేసింది. కింగ్డమ్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న దేశ ప్రజలు అందరూ సెహత్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. తొలి దశ ముగియటంతో ప్రస్తుతం రెండో దశ వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నామని...ఇక నుంచి ఎవరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికే తొలి ప్రాధాన్యం ఇస్తామని వివరించింది. అయితే..ముందస్తు షెడ్యూల్ ప్రకారం రెండో దశ వ్యాక్సినేషన్ నెల రోజుల ముందుగానే చేపట్టాల్సి ఉంది. కానీ, ఫైజర్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో కొరత నెలకొనటంతో సెకండ్ బ్యాచ్ అనుకున్న సమయానికి కింగ్డమ్ కు దిగుమతి కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. అంతేకాదు..డిసెంబర్ 17 నుంచి చేపట్టిన తొలి దశ వ్యాక్సినేషన్లో కింగ్డమ్ పరిధిలోని ఐదు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి ప్రాధాన్య వర్గాలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పుడు రెండో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేయటమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది తమంతట తాముగా వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ ఏడాది చివరి నాటికి 26 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నది కింగ్డమ్ లక్ష్యమని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







