నాసా మార్స్ రోవర్ విజయవంతం, చిత్రాలు విడుదల.!
- February 19, 2021అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన మార్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు నాసా.. అంగారక గ్రహం మీద మార్స్ రోవర్ ల్యాండ్ అయిన తర్వాత తీసి పంపిన చిత్రాన్ని గురువారం విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో మార్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయంవంతంగా ల్యాండ్ అయింది. అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లను తెలుసుకునేందుకు నాసా ఏడు నెలల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే అప్పుడు ప్రయోగించిన ఈ మార్స్ రోవర్ ఈ రోజు కక్ష్యలో ప్రయాణించి లక్ష్యానికి చేరువైందని.. చివరి ఏడు నిమిషాల గండాన్ని సైతం అధిగమించందని నాసా వెల్లడించింది. అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లు, అక్కడి వాతావరణాన్ని కనుగొనేందుకు కోసం నాసా రోబో మార్స్ రోవర్‌ను ప్రయోగించింది. ఈ రోవర్ అంగారక గ్రహంలోని జెజెరో క్రేటర్ అనే ప్రదేశంలో విజయవంతంగా ల్యాండ్ అయి అంతరిక్ష నౌక నుంచి విడిపోయింది. ఈ ప్రయోగానికి నాసా 2.4 బిలియన్ డాలర్లు (దాదాపు 17వేల కోట్లు) ఖర్చు చేసింది. దీనితోపాటు ఒక SUV సైజులో ఉండే Perseverance అనే రోబోను కూడా అంగారక గ్రహం మీదకు పంపింది. ప్రస్తుతం అది తీసిన ఫొటోలను, దృశ్యాలను నాసా విడుదల చేసింది.
పెర్సర్వరెన్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిన అనంతరం నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ స్టీవ్ జుర్జిక్ బృందాన్ని అభినందించారు. జూలై 30, 2020 న ప్రారంభమైన మార్స్ రోవర్ ప్రయాణం.. ఈ రోజు విజయవంతమైందని వెల్లడించారు. కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకోని సైతం శాస్త్రవేత్తలు అసాధారణ కృష్టిచేశారని వెల్లడించారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!