బాలయ్య - బోయపాటి మూవీకి టైటిల్ ఫిక్స్.!
- February 19, 2021సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శీను కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీబీ3 అనే టైటిల్‌తో ప్రచారం జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య అఘోరాగ కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
బాలయ్య ఇమేజ్‌కు, కథకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించిన మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కొద్ది రోజులలో రానుంది. రవీందర్ రెడ్డి నిర్మాణంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 28న ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్