మునిసిపాలిటీల్లో తనిఖీలు ముమ్మరం

- February 20, 2021 , by Maagulf
మునిసిపాలిటీల్లో తనిఖీలు ముమ్మరం

దోహా:కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఈటరీస్ ఇతర ఔట్‌లెట్లలో ఆహార పదార్థాల నాణ్యత, భద్రత వంటి అంశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ఎంఎంఈ) వెల్లడించింది. దేశంలోని అన్ని మునిసిపాలిటీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత నెల (జనవరి)లో 15,000కి పైగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా 12,000 తనిఖీలు నిర్వహించారు. 2,841 ఉల్లంఘనల్ని గత నెలలో గుర్తించారు. ఉల్లంఘనలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగిందని అదికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అతారిటీస్ స్పష్టం చేవాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com