బాలీవుడ్ స్టార్స్‌కి వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్
- February 21, 2021
ముంబై: మహరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు బాలీవుడ్ స్టార్ హీరోలకు వార్నింగ్ ఇస్తున్నారు. దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నా వారు నోరు మెదపడం లేదని, వారు దీనిపై స్పందించి తీరాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ పటోలే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను దృష్టిలో ఉంచుకొని మాట్లాడారు. దాంతో ముంబై పోలీసులు అమితాబ్ బచ్చన్ ఇంటిముందు రక్షణను పెంచారు. ఈ వారంలోనే మహరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పటోలే బాలీవుడ్ తారలు పెట్రోల్ ధరలపై ఎందుకు మాట్లాడటం లేదనీ, ముఖ్యంగా అమితాబ్, అక్షయ్‌లను ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే ట్వీట్‌లు చేసిన వారు ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదని అన్నారు. వారు దీనిపై స్పందించకపోతే రాష్ట్రంలో వారి సినిమాలు విడుదల కావని, చిత్రీకరణలు కూడా జరపలేరని అన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మేడే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అజయ్ దేవగన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, అంగీరా ధర్, ఫేమస్ యూట్యూబర్ కారీమినాటి వంటి వారు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా అమితాబ్ మరో సినిమా ‘ఝుండ్’ జూన్ 18న రిలీజ్ కానుంది. మరి ఈ పరిస్థితుల్లో అమితాబ్ ఏం చేస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష