సోషల్ మీడియాకు చెక్ పెట్టడానికి కొత్త చట్టం తెస్తున్నాం!
- February 21, 2021
న్యూఢిల్లీ: ప్రభుత్వాలనే గద్దె దించే సత్తా సోషల్ మీడియాకు ఉన్నదని అన్నారు బీజేపీ నేత రామ్‌మాధవ్. దీని ప్రభావం చాలా ఉన్నదని, ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసి, అరచకానికి దారి తీసేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని నియంత్రించడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవడం లేదని, అందుకే భారత ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో ఉన్నదని రామ్‌మాధవ్ వెల్లడించారు. తన కొత్త పుస్తకం బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాజకీయేతర, రాజ్యేతర శక్తులతో ప్రజాస్వామ్యం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని రామ్‌మాధవ్ అన్నారు. సోషల్ మీడియా ఎంత శక్తవంతమైనదంటే అది ప్రభుత్వాలనే కూల్చేయగలదు. వాటికి హద్దులంటూ ఏమీ లేకపోవడంతో నియంత్రించడం కష్టమవుతోంది. ఈ శక్తులు అరాచకానికి దారితీస్తాయి. మన రాజ్యాంగంలోనే పరిష్కారాలు ఉన్నాయి అని రామ్‌మాధవ్ అన్నారు. ట్విటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఘర్షణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష