వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండి..టీచర్లకు కువైట్ సూచన
- February 21, 2021
కువైట్ సిటీ:వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బందిని ప్రాధాన్యత వర్గంలో చేర్చినట్లు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి వెల్లడించారు.స్కూల్ టీచర్లు కువైతీలు, ప్రవాసీయులు ఎవరైనా సరే తమ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదని మంత్రిత్వ శాఖ కార్యాలయం అభిప్రాయపడింది.దీనికి సంబంధించి కువైట్ వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బంది వెంటనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. ఒకవేళ ఇప్పటికే వ్యక్తిగత శ్రద్ధతో వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆయా వివరాలను విద్యా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో పేర్కొంటూ తమ వివరాలను సవరించాలని కూడా సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







