కువైట్‌కి నేషనల్‌డే శుభాకాంక్షలు తెలిపిన బహ్రెయిన్
- February 26, 2016
బహ్రెయిన్ నాయకత్వం, కువైటీ నాయకత్వానికి 'నేషనల్ డే' శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ సందేశాని బహ్రెయిన్, కువైట్‌కి పంపింది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, కువైట్ అమీర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందేశంలో బహ్రెయిన్ పేర్కొంది. ఇరు దేశాల మధ్యా చారిత్రక బంధం కొనసాగాలని బహ్రెయిన్ ఆకాంక్షించింది. కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబా మరియు ప్రైమ్ మినిస్టర్ జబీర్ అల్ ముబారక్ అల్ హమాద్ అల్ సబాలకు కూడా ఇదే సందేశం పంపడం జరిగింది. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా కూడా కువైట్ అమీర్ షేక్ సబా, కువైట్ క్రౌన్ ప్రిన్స్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







